నితిన్ పెళ్లితో ఆడుకుంటున్న కరోనా వైరస్

Published on Mar 10,2020 11:43 AM

కరోనా వైరస్ నితిన్ పెళ్లితో ఆడుకుంటోంది. నితిన్ పెళ్లి ఈ ఏప్రిల్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ లా దుబాయ్ లో చేసుకోవాలని ప్లాన్ చేసాడు. ఈపాటికే అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా వైరస్ కు బిక్కచచ్చిపోతున్నారు జనాలు. ఒకవైపు కరోనా రోజు రోజుకి ఎక్కువ అవుతుంటే ఈ పరిస్థితుల్లో పెళ్లి ఎలా అనే డైలమాలో పడ్డారు నితిన్ అండ్ కో.

ఇప్పటికే నితిన్ ఎంగేజ్ మెంట్ అయ్యింది ఇక పెళ్లి కావడమే తరువాయి అయితే ఈలోపు కరోనా వచ్చింది. కరోనా ఎఫెక్ట్ తో పలు దేశాల్లో రాకపోకలపై తాత్కాలిక నిషేధం అమలులోకి వచ్చింది. శుభమా అని పెళ్లి చేసుకుంటున్న ఈ తరుణంలో కరోనా వైరస్ రావడం ఏంటి ? అని తీవ్రంగా మదన పడుతున్నారట. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా భయం మాత్రం పట్టి పీడిస్తూనే ఉంది. భీష్మ విజయంతో మంచి జోష్ మీదున్న నితిన్ పెళ్లి విషయంలో మాత్రం కంగారుగానే ఉన్నాడు కరోనా భయంతో.