నితిన్ కు కరోనా దెబ్బ !

Published on Mar 15,2020 06:19 PM
ఇటీవలే భీష్మ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ కు కరోనా దెబ్బ గట్టిగానే తగిలింది. నితిన్ కు కరోనా దెబ్బ అనగానే ఆ వైరస్ సోకిందని అనుకునేరు కాదు సుమా ! నితిన్ - షాలిని ని ప్రేమించాడు వాళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా దుబాయ్ లో ఏప్రిల్ 16 న చేయాలనుకున్నారు. అందుకోసం భారీ ఏర్పాట్లు కూడా చేసారు. అయితే కరోనా దెబ్బతో దుబాయ్ లో జరగాల్సిన డెస్టినేషన్ వెడ్డింగ్ క్యాన్సిల్ అయ్యింది.

ఇక ఈ పెళ్లి హైదరాబాద్ లో చేయాలని అనుకున్నారు ఇప్పుడు వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో ఏప్రిల్ 16 న పెళ్లి జరగడం కష్టమే అని తెలుస్తోంది. ఒకవేళ పెళ్లి చేయాల్సి వస్తే కేవలం కొంతమంది సన్నిహితుల సమక్షంలోనే పెళ్లి చేయనున్నారట లేదంటే పెళ్లి వాయిదా వేయడమే అని తెలుస్తోంది. మరో వారం రోజులు పొతే కానీ ఓ స్పష్టత రాదంటున్నారు నితిన్ తరుపువాళ్ళు. మొత్తానికి కరోనా దెబ్బ గట్టిగానే తగులుతోందన్న మాట నితిన్