యాంకర్ రవి కారు యాక్సిడెంట్

Published on Dec 10,2019 05:38 PM

యాంకర్ రవి కారు యాక్సిడెంట్ కి గురయ్యింది అయితే ఈ కారు ప్రమాదంలో యాంకర్ రవి కి ఎలాంటి గాయాలు కాలేదు దాంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. కాకపోతే కారుకి యాక్సిడెంట్ అయింది కాబట్టి కారు దెబ్బతింది. ఈ సంఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది. ఎర్రగడ్డ - మూసాపేట మధ్య ఉన్న ఫ్లయ్ ఓవర్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగిందట. రవి ప్రయాణిస్తున్న కారుని మద్యం తాగి డ్రైవ్ చేస్తున్న లారీ డ్రైవర్ గుద్దేసాడు. దాంతో వాళ్ళని ఆపి సీరియస్ అయ్యాడట యాంకర్ రవి. అయితే మద్యం మత్తులో ఉన్నప్పటికీ మాకు భార్యా పిల్లలు ఉన్నారు పేదవాళ్లం అని చెప్పి రవి ని బ్రతిమిలాడి వెళ్లిపోయారట ఆ లారీ డ్రైవర్ , క్లీనర్ లు.

లారీ వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ యాంకర్ రవి మాత్రం సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడట. ఎందుకంటే మద్యం తాగి లారీ ని డ్రైవ్ చేస్తూ మరింత పెద్ద ప్రమాదానికి కారణం అయితే ఇంకా దారుణం జరుగుతుంది కాబట్టి మద్యం తాగి వాహనం నడిపే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని అంటున్నాడు యాంకర్ రవి. బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న యాంకర్ రవి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. నిజమే మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరి.