కెప్టెన్ మర్వెల్ మార్చ్ 8న ఇండియన్ థియేటర్స్ లో విడుదల

Published on Mar 07,2019 05:24 PM

కరోల్ డాన్వర్స్ (బ్రీ లార్సన్) ఒక లేడీ పైలట్. సూపర్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేస్తుంటుంది, కాగా కొన్ని పరిస్థితుల్లో అనుకోకుండా గుర్తుకు వచ్చే తన గతం తాలూకు జ్ఞాపకాలతో ఆమె ఇబ్బంది పడుతూ ఉంటుంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకున్నా .. అది ఆమె వల్ల కాదు. అయితే ఆమె కొన్ని విపరీతమైన శక్తులను కలిగి ఉంటుంది, కానీ వాటిని ఎలా ఉపయోగించాలో ఆమెకు తెలియదు.

ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఆమెకు యాదృచ్ఛికంగా తన గతం గురించి తెలుస్తోంది. అలాగే కొన్ని నిజాలు తెలుస్తాయి. దాంతో ఆమెకు ఎవరు మంచి ? ఎవరు చెడు ? అని తెలుస్తోంది. మరి మంచి వాళ్ల కోసం ఆమె ఏం చేసింది ? ఆమెకున్న పవర్ ను సరైన విధంగా ఎలా ఉపయోగించింది ? ఆ క్రమంలో ఆమె విజయం సాధించిందా ? విజయం సాధించిండానికి ఆమె ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ఆస్కార్‌ అవార్డు గ్రహీత బ్రీ లార్సన్‌ ఈ చిత్రంలో సూపర్ పవర్స్ ఉన్న పాత్రలో నటించింది. ఆమె ఆ పాత్రలో ఇన్ వాల్వ్ అయిన విధానం, ఈ సినిమా కోసం ఆమె చూపించిన అంకితభావం గురించి మరియు నిబద్ధత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. వేగంగా వెళుతున్న రైలు పై లార్సన్‌ పోరాడిన సన్నివేశాలు అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలకమైన యాక్షన్ సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ‌ఆ సన్నివేశాల కోసం లార్సన్‌ చేసిన కఠినమైన కసరత్తులు కూడా మనల్ని ఆకట్టుకుంటాయి.

సినిమాలో లార్సన్‌ ఫ్రెండ్ గా నటించిన నటి కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. కీలకమైన పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా కొన్ని కీలకమైన దృశ్యాల్లో ఆమె పలికించిన హావభావాలు ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక లార్సన్‌ కు కమాండర్ గా నటించిన నటుడు కూడా విలన్ పాత్రలో తన నటనతో మెప్పిస్తారు

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ముందే చెప్పుకున్నట్లు దర్శకులు ఆన్నా బోడెన్‌, రయాన్ ఫ్లెక్ ఆసక్తిని పెంచే పాయింట్ తో సినిమాని ప్రారంభించారు.

సంగీత దర్శకుడు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగా అక్కట్టుకున్నేలా ఉంది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఆస్కార్‌ అవార్డు గ్రహీత బ్రీ లార్సన్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించగా.. ఆన్నా బోడెన్‌, రయాన్ ఫ్లెక్‌ దర్శకత్వంలో.. మార్వెల్‌ సంస్థ నుండి రానున్న ఈ ‘కెప్టెన్‌ మార్వెల్‌’ డబ్బింగ్ చిత్రం కొన్ని సన్నివేశాలు మినహా.. సినిమా ఆసక్తికరంగా సాగుతూ ఆకట్టుకుంటుంది. సూపర్‌ పవర్ సినిమాలంటే అమితంగా ఇష్ట వారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఓవరాల్ గా సినిమా మాత్రం సూపర్‌ పవర్ యాక్షన్‌ సన్నివేశాలతో, భారీ యాక్షన్‌ యాక్షన్ సీన్స్ తో మరియు విజువల్‌ ఎఫెక్ట్స్‌ తో అద్భుతంగా అనిపిస్తోంది. యాక్షన్ సినిమాలను అమితంగా ఇష్టపడేవారికి ఈ సినిమా కన్నులపండుగగా ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో అంటున్నారు హాలీవుడ్ మూవీ లవర్స్