వెంకీ మామ ని కొన్నవాళ్ళు సేఫ్ అవుతారా !

Published on Dec 21,2019 09:25 AM

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన వెంకీ మామ చిత్రాన్ని 33 కోట్లకు కొన్నారు బయ్యర్లు. తెలంగాణ , ఆంధ్రప్రదేస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ ఇలా అన్ని ఏరియాలు కలిపి 33 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది.  డిసెంబర్ 13 న విడుదలైన వెంకీ మామ ఇప్పటివరకు 27 కోట్ల షేర్ ని రాబట్టింది అంటే మరో 7 కోట్లకు పైగా షేర్ వస్తే వెంకీ మామ బయ్యర్లు సేఫ్ అవుతారు లేకపోతే స్వల్ప నష్టాలను చవిచూస్తారు. ఇప్పటివరకు చూస్తే బయ్యర్లు సేఫ్ అవ్వడం ఖాయమనే తెలుస్తోంది కానీ ఈరోజు వరకు ఎంత లాగితే అంత మంచిది వెంకీ మామకు.

ఎందుకంటే రేపు బాలయ్య రూలర్ , సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 , సాయిధరమ్ తేజ్ ప్రతి రోజూ పండగే , కార్తీ దొంగ చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఈ నాలుగు చిత్రాల వల్ల రేపు ఎలాగూ వెంకీ మామ కు కలెక్షన్స్ ఉండవు. ఒకవేళ ఆ నాలుగు సినిమాలు బాగవులేకపోతే మాత్రమే వెంకీ మామ కు మళ్ళీ మంచి వసూళ్లు వస్తాయి. ఇప్పటివరకైతే 27 కోట్లు రాబట్టాడు కాబట్టి ఈరోజు వసూళ్లతో అవలీలగా 30 కోట్ల షేర్ లో పడతాడు. ఇక మిగిలింది 3 కోట్లే కాబట్టి అవి కూడా ఎలాగోలా రాబట్టవచ్చు అని భావిస్తున్నారు. అలా రాబడితే వెంకీ మామ బయ్యర్లు సేఫ్ అవుతారు లేదంటే స్వల్ప నష్టాలు తప్పకపోవచ్చు. వెంకీ మామ బయ్యర్ల భవితవ్యం ఏంటి అన్నది రేపు తేలనుంది.