శ్రీకాంత్ విలన్ గా మెప్పిస్తాడా ?

Published on Dec 14,2019 12:27 PM

హీరో శ్రీకాంత్ విలన్ గా మారుతున్నాడు బాలయ్య సినిమా కోసం. నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా దర్శకులు బోయపాటి శ్రీను తో మూడో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరో శ్రీకాంత్ ని విలన్ పాత్రకు ఎంపిక చేశారట దర్శకులు బోయపాటి. దర్శకుడి అభిప్రాయంతో బాలయ్య కూడా ఏకీభవించాడట దాంతో శ్రీకాంత్ విలన్ గా నటించడం ఖాయమైపోయింది. ఇంతకుముందు శ్రీకాంత్ యుద్ధం శరణం అనే చిత్రంలో విలన్ గా నటించాడు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది అలాగే నటుడిగా శ్రీకాంత్ కు కూడా అంతగా నటించడానికి స్కోప్ లేకుండాపోయింది. విలన్ గా అనవసరంగా నటించాడు అని విమర్శలు వచ్చాయి కూడా.

కట్ చేస్తే ఇప్పుడు బాలయ్య సినిమాలో శ్రీకాంత్ కు మరో ఛాన్స్ లభించింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట శ్రీకాంత్. లెజెండ్ చిత్రంలో జగపతిబాబు ని విలన్ గా చూపించి సెకండ్ ఇన్నింగ్స్ కి స్కోప్ ఇచ్చారు బాలయ్య - బోయపాటి . ఇక ఇప్పుడేమో ఆ వంతు శ్రీకాంత్ కు వచ్చింది. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ చిత్రాలు పెద్ద హిట్ కావడంతో ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరోగా 100 కు పైగా చిత్రాల్లో నటించిన శ్రీకాంత్ కు ఇది మంచి బ్రేక్ అనే చెప్పాలి.