రూలర్ కు భారీ నష్టం తప్పదా !

Published on Dec 23,2019 09:55 AM

నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ ని కొన్న బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. డిసెంబర్ 20 న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు 9 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి దాంతో 4. 29 కోట్ల షేర్ వచ్చింది అయితే అంతకుమించి డిజాస్టర్ టాక్ వచ్చింది రూలర్ చిత్రానికి దాంతో నిన్న కలెక్షన్లు లేకుండాపోయాయి ఈ చిత్రానికి. డిజాస్టర్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి దాంతో రూలర్ కు నిన్న కేవలం 92 లక్షల షేర్ మాత్రమే వచ్చింది.

అంటే రెండు రోజుల్లో అయిదున్నర కోట్ల షేర్ కూడా రాలేదు. ఇక ఈరోజు ఆదివారం కాబట్టి కాస్త కలెక్షన్స్ ఉండొచ్చు కానీ రేపు మాత్రం దారుణమైన దెబ్బ తగలబోతోంది రూలర్ బయ్యర్ లకు. ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో 21 కోట్లకు కొన్నారు, అంటే 21 కోట్ల షేర్ రావాలి అప్పుడే బయ్యర్లు సేఫ్ అవుతారు. 21 కోట్ల షేర్ రావాలంటే రూలర్ దాదాపు 45 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలి కానీ పరిస్థితి చూస్తుంటే 20 కోట్ల గ్రాస్ వసూల్ చేయడం కూడా కష్టమే అన్నట్లుగా తెలుస్తోంది అంటే ఈ సినిమాని కొన్న బయ్యర్లకు భారీ నష్టాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.