ఎన్టీఆర్ తమిళనాట హిట్ కొడతాడా ?

Published on Nov 26,2019 01:03 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రాన్ని తాజాగా '' విజేయన్ '' గా తమిళంలో అనువాదం చేస్తున్నారు. 2007 లో వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత అంటే 12 ఏళ్ల తర్వాత తమిళంలో డబ్బింగ్ చేసారు. ఇక ఈ సినిమా ఈనెల 29 న విడుదల కానుంది. ఎన్టీఆర్ , మోహన్ బాబు , రంభ , ప్రియమణి , కుష్బూ , అర్చన , ప్రతీ జింగ్యానీయ , నవనీత్ కౌర్, మమతా మోహన్ దాస్  తదితరులు నటించిన ఈ చిత్రం తమిళనాట హిట్ అవుతుందా ? అన్నది ప్రశ్నగా మారింది.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ హిట్ అయితే అక్కడ ఎన్టీఆర్ ఇమేజ్ పెరగడం ఖాయం దాంతో ఆ ప్రభావం ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై తప్పకుండా పడుతుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 30 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. యమదొంగ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్ తమిళ ప్రేక్షకులను మెప్పించగలడా ? అన్నది ఈనెల 29 న తేలిపోనుంది.