నాని 60 కోట్లు వసూల్ చేయగలడా

Published on Sep 11,2019 07:10 PM

నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ ఈనెల 13 న విడుదలకు సిద్ధమైంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో నాని 60 కోట్ల గ్రాస్ వసూళ్ల ని 30 కోట్ల షేర్ ని రాబట్టాలి అప్పుడే ఈ సినిమాని కొన్న బయ్యర్లు లాభపడతారు. నాని నటించిన జెర్సీ చిత్రం భారీ వసూళ్ల ని సాధించలేకపోయింది , అయితే గుడ్డిలో మెల్ల లాగా నాని కి మాత్రం నటుడిగా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇక ఇప్పుడేమో గ్యాంగ్ లీడర్ విడుదల అవుతోంది , ఈ సినిమాతో 30 కోట్ల షేర్ రాబట్టాలి . ఈ సినిమాని 28 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ కు అమ్మారు అంటే పెట్టిన పెట్టుబడి బయ్యర్లకు రావాలంటే 30 కోట్ల షేర్ రావాల్సిందే. అప్పుడే హిట్ అనిపించుకుంటుంది. సాహో ప్లాప్ కావడంతో నాని సినిమాపై ఆశలు పెట్టుకున్నారు బయ్యర్లు. పైగా నాని కి చాలా మంచి ఛాన్స్ వచ్చింది భారీ వసూళ్లు సాధించడానికి . బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేదు అది నాని కి కలిసి వచ్చే అంశం మరి.