ఆ డైరెక్టర్ హీరోగా హిట్ కొడతాడా ?

Published on Oct 26,2019 02:59 PM

పెళ్లిచూపులు చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ తాజాగా హీరోగా మారిన విషయం తెలిసిందే. మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు దాస్యం తరుణ్ భాస్కర్, ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది ఎవరో తెలుసా ....... క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. తనని హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్ ఋణం తీర్చుకోవడానికి ఇలా సిద్ధం అయ్యాడు విజయ్ దేవరకొండ.

ఇక ఈ చిత్రంలో హాట్ భామ అనసూయ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. మీకు మాత్రమే చెప్తా అనే చిత్రం నవంబర్ 1 న విడుదల అవుతోంది. దర్శకుడిగా ఒక బ్లాక్ బస్టర్ ని ఒక ప్లాప్ ని మూటగట్టుకున్న తరుణ్ భాస్కర్ హీరోగా విజయం సాధిస్తాడా ? లేదా ? అన్నది నవంబర్ 1 న తేలిపోనుంది.