వెంకీ కొట్టాడు మరి బాలయ్య కూడా కొడతాడా ?

Published on Dec 14,2019 10:18 AM

ఈరోజు విడుదలైన వెంకటేష్ చిత్రం వెంకీ మామ చిత్రానికి హిట్ టాక్ వస్తోంది. లవ్ , యాక్షన్ , సెంటిమెంట్ కలగలిపి రూపొందించిన వెంకీ మామ హిట్ అయినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే డిసెంబర్ 20 న వచ్చే బాలయ్య కూడా హిట్టు కొడతాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ చిత్రాన్ని డిసెంబర్ 20 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ లో బాలయ్య రెండు విభిన్న గెటప్ లలో కనిపిస్తున్నాడు.

ఇక యధావిధిగా బాలయ్య సినిమాలో ఉండాల్సిన పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నట్లు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. అయితే దాదాపు మూడేళ్ళుగా బాలయ్య కు సరైన హిట్ లేకుండాపోయింది. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య నటించిన చిత్రాలన్నీ వస్తున్నాయి పోతున్నాయి తప్ప హిట్ కావడం లేదు. సీనియర్ హీరోలలో అందరికంటే ఎక్కువగా ఫాస్ట్ గా సినిమాలు చేస్తోంది ఒక్క బాలయ్యే ! వెంకటేష్ వెంకీ మామ చిత్రంతో హిట్ కొట్టాడు తన సీనియారిటీ ని నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు బాలయ్య వంతు వస్తోంది. వెంకీ తో పోటీపడి హిట్ కొడతాడా ? లేదా ? అన్నది డిసెంబర్ 20 న తేలనుంది. అప్పటి వరకు వెంకీ మామ బాక్సాఫీస్ వద్ద తన జేబు నింపుకొని బయ్యర్లను లాభాలలో ముంచెత్తడం ఖాయం.