స్టార్ హీరోలపై నిందలు వేస్తున్న కెమెరామెన్

Published on Nov 26,2019 11:10 AM

ప్రముఖ ఛాయాగ్రాహకులు చోట కే నాయుడు స్టార్ హీరోలపై నిందలు వేస్తున్నాడు. తెలుగులో భారీ ఎత్తున భారీ చిత్రాలు వస్తున్నాయి కానీ తెలుగు కెమెరామెన్ లు మాత్రం ఆ సినిమాలు చేయడం లేదని దీనికంతటికి కారకులు స్టార్ హీరోలేనని సంచలన వ్యాఖ్యలు చేసాడు చోటా కే నాయుడు. ప్రస్తుతం చోటా కే నాయుడు కు తెలుగులో స్టార్ హీరోల చిత్రాలు రావడం లేదు దాంతో ఉడికిపోతున్నాడు చోటా.

పోనీ వేరే ఛాయాగ్రాహకులను తీసుకుంటున్నారు ఏమైనా క్వాలిటీ ఉంటోందా అంటే అది కూడా ఉండటం లేదు అంటూ దీనికి ముమ్మాటికీ స్టార్ హీరోలే కారకులని ఆరోపిస్తున్నాడు చోటా. అయితే చోటా కే నాయుడు కు కాస్త అతి ఎక్కువ అని అందుకే స్టార్ హీరోలు దూరం పెడుతున్నారని తెలుస్తోంది. అయితే వర్క్ విషయంలో మాత్రం చోటా కు చాలా మంచి పేరుంది, కాకపోతే ఇతర విషయాల పట్ల అసంతృప్తితో ఉంటున్నారట అందుకే చోటా కు తెలుగులో స్టార్ హీరోల సినిమాలు లేకుండాపోయాయి.