దేవిశ్రీ ప్రసాద్ కోసం గొడవ పడుతున్న బన్నీ - సుకుమార్

Published on Feb 10,2020 08:19 PM

ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ వల్ల హీరో అల్లు అర్జున్ దర్శకులు సుకుమార్ గొడవ పడుతున్నారట. ఇంతకీ ఈ ఇద్దరికీ గొడవ ఎందుకు వచ్చిందో తెలుసా ...... గతకొంత కాలంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు సంచలనం సృష్టించడం లేదు. సినిమాలో ఫరవాలేదు అనిపించేలా ఉంటున్నాయి కానీ ఇంతకుముందులా మాత్రం వండర్స్ క్రియేట్ చేయడం లేదు. దాంతో దేవిశ్రీ ప్రసాద్ కు బదులుగా మన కాంబినేషన్ లో వచ్చే సినిమాకు తమన్ అయితే బాగుంటాడు అని అన్నాడట అల్లు అర్జున్ .

అయితే తమన్ వద్దు దేవిశ్రీ ప్రసాద్ ముద్దు అని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పాడట దర్శకులు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు ఆడియో పరంగా సంచలనం సృష్టించాయి అందుకే దేవి అంటే సుక్కు కు అంత ప్రేమ . అల్లు అర్జున్ కు కూడా ఇష్టమే కానీ ఈమధ్య దేవి అందించిన పాటలు అంతగా ఆకట్టుకోవడం లేదు . అదే తమన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. పైగా అల ..... వైకుంఠపురములో చిత్రానికి తమన్ అందించిన పాటలు హైలెట్ గా నిలిచాయి అందుకే తమన్ కావాలని పట్టుబడుతున్నాడట బన్నీ. కానీ సుకుమార్ మాత్రం వినడం లేదట.