హీరోయిన్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బ్రహ్మాజీ

Published on Apr 02,2020 03:57 PM
కరోనా మహమ్మారి వల్ల సినిమా షూటింగ్ లన్నీ ఆగిపోయి ప్రజలతో పాటుగా సినిమా కార్మికులు కూడా పస్తులుంటున్న ఈ సమయంలో హీరోలు మాత్రమే విరాళాలు ఇస్తున్నారని కానీ హీరోయిన్ లు మాత్రం ఇంతవరకు ఎందుకు స్పందించలేదని వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ లుగా చెలామణి అవుతున్న వాళ్లంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లే.

అలాంటి వాళ్ళని తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటున్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో సినీ కార్మికులకు , తెలుగు ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో హీరోయిన్ లు ఎవరూ స్పందించకపోవడం విరాళాలు ఇవ్వకపోవడం శోచనీయమే ! అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే హీరోయిన్ ప్రణీత , లావణ్య త్రిపాఠీ లు చెరో లక్ష చొప్పున సహాయం ప్రకటించారు. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందుతున్న వాళ్ళు మాత్రం ఇంకా స్పందించలేదు.