*దర్శకుడు బోయపాటి శ్రీను చేతుల మీదుగా నిన్ను తలచి ట్రైలర్ విడుదల. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిన్ను తలచి*

Published on Sep 25,2019 01:27 PM

ఎస్‌.ఎల్‌.ఎన్‌ ప్రొడక్షన్స్‌, నెదురుమల్లి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను తలచి'. అనిల్‌తోట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంతో వంశీఎక్కసిరి, స్టెఫీపాటిల్‌ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఏలేంద్ర మహవీర సంగీతాన్ని అందించారు. ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా నిన్ను తలచి ట్రయిల్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. దర్శకుడు బోయపాటి శ్రీను తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

*దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ...*

చిన్న సినిమా అయినా సరే వారికి అండగా నిలబడాలని సపోర్టు చేస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నిన్ను తలచి టైటిల్ లొనే పాజిటీవ్ ఎనర్జీ ఉంది. పరిశ్రమలో మంచి సినిమానా కాదా అనే రెండే ఉంటాయి. మంచి సినిమాను మనం ప్రోత్సహించాల్సిందే. దానికి మీడియా సపోర్ట్ కావాలి. దర్శక నిర్మాతలు ఈ టైటిల్ ను ఖరారు చేసినప్పుడే వారు సగం సక్సెస్ అయ్యారు. మంచి పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. మరొక్కసారి చిత్ర యూనిట్ సభ్యులకు నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

*దర్శకుడు అనిల్ తోట మాట్లాడుతూ...*
నిన్ను తలచి సినిమా సాంగ్స్ ను మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు సినిమా అంతా పాజిటీవ్  గా ముందుకు వెళుతుంది. డిఓపి శ్యామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగా చేశారు. లిరిక్స్ బాగా రావడానికి కారణం శ్రీమణి గారు, పూర్ణాచారి గారు. ఇద్దరు అద్భుతమైన సాహిత్యం ఇచ్చారు.  నిన్ను తలచి మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.

*హీరో వంశీ మాట్లాడుతూ..* మా సినిమాను సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నిన్ను తలచి ట్రైలర్, టీజర్, సాంగ్స్ చూశారు, మీకు మా సినిమా మీద ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మా డైరెక్టర్ అనిల్ అనుకున్న పాయింట్ ను డీసెంట్ గా ప్రెజెంట్ చేశారు. మ్యూజిక్ , కెమెరావర్క్ సినిమాకు ప్లస్ కానున్నాయి. ‘ఓ ఫీల్ గుడ్ మూవీతో నేను టాలీవుడ్ కి పరిచయం అవ్వడం చాలా ఆనందం గా ఉంది, అలానే ఎక్కడ లోటు కాకుండ నిర్మాతలు ఈ సినిమాను రూపొందించారు. మా పి.ఆర్.ఓ ఏలూరు శ్రీను గారు నిన్ను తలచి సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు, వారికి థాంక్స్. సెప్టెంబర్ 27న మీ ముందుకు వస్తున్న మా సినిమా అందరికి నచ్చితుందని భావిస్తున్నాను అన్నారు.

*హీరోయిన్ స్టెఫీ పటేల్ మాట్లాడుతూ...*

మా ట్రైలర్ లాంచ్ కు వచ్చిన ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాకు థాంక్స్. డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి చేతుల మీద మా చిత్ర ట్రైలర్ విడుదల కావడం సంతోషం. మంచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నందుకు హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

*మ్యూజిక్ డైరెక్టర్ ఎలెందర్ మహావీర్ మాట్లాడుతూ...*  
 
నిన్ను తలచి టైటిల్ సాంగ్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. నిర్మాత అజిత్ గారు సినిమాను రిచ్ గా ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. దర్శకుడు అనిల్ గారు మంచి ఎమోషనల్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అన్నారు.