బోయపాటి -బాలయ్య సినిమాకు కష్టాలు

Published on Dec 27,2019 10:58 PM

రూలర్ చిత్రం డిజాస్టర్ కావడంతో బోయపాటి శ్రీను - బాలయ్య కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రం డైలమాలో పడింది. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకున్న విషయం తెలిసిందే. బాలయ్య - బోయపాటి ల కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలవడంతో ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే అనూహ్యంగా బాలయ్య నటించిన రూలర్ ఘోర పరాజయం పొందడంతో బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు. పైగా ఈ సినిమాని అమ్మింది కేవలం 21 కోట్లకు మాత్రమే.

బయ్యర్లకు 21 కోట్ల షేర్ వస్తే లాభాలు వచ్చినట్లే కానీ ఈ సినిమాకు పట్టుమని 8 కోట్ల షేర్ కూడా రాలేదు దాంతో బాలయ్య తదుపరి సినిమాకు కష్టాలు అలుముకున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు ,ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు దారుణంగా దెబ్బకొట్టాయి దానికి తోడు ఇప్పుడు రూలర్ కూడా రాడ్డు లా మారడంతో బోయపాటి - బాలయ్య సినిమా పై పడింది ఆ ప్రభావం. బోయపాటి 70 కోట్ల బడ్జెట్ చెప్పాడట అంటే ఆ సినిమా నిర్మించి అనవసరం కూడా అందుకే ఈ సినిమా బడ్జెట్ తగ్గించే పనిలో పడ్డారట ! అలా కుదరకపోతే ఈ సినిమా క్యాన్సిల్ అవ్వడం ఖాయం అని అంటున్నారు.