మహర్షి మూవీ సెట్ లో" boy" ఫస్ట్ లుక్ విడుదల

Published on Apr 08,2019 02:20 PM

"విశ్వరాజ్ క్రియేషన్స్" బ్యానర్ పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం "boy".  ఈ సినిమా ఫస్ట్ లుక్ ను  అన్నపూర్ణ స్టుడియోస్ లో "మహర్షి " సినిమా సెట్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి లాంచ్ చేశారు.  వంశీ పైడిపల్లి మాట్లాడుతూ... ఈ సినిమా టైటిల్ 'బోయ్' నాకు బాగా నచ్చింది. బోయ్ స్టేజ్ లో ప్రతి ఒక్కరికి ఎన్నో మెమొరీస్ ఉంటాయి. హై స్కూల్ యూనిఫామ్ లో ఉన్న స్టూడెంట్, కాలేజ్ వైపు చూస్తూ ఉన్న ఈ పోస్టర్ వెనకున్న కాన్సెప్ట్ చూస్తుంటే, నాకు నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి.  అమర్ కి సినిమా  అంటే ప్యాషన్. పోస్టర్ విషయం లోనే  ఇంత శ్రద్ద తీసుకుంటే సినిమా ఇంకా బాగా తీసుంటారని అర్ధమవుతుంది. సమయం కుదుర్చుకుని ఈ సినిమా చూడాలనుంది అని అన్నారు. దర్శకుడు అమర్ కి మరియు "boy" చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు.