24 గంటల్లో ఇద్దరు నటుల మృతి : షాక్ లో బాలీవుడ్

Published on Apr 30,2020 04:49 PM
కేవలం 24 గంటల్లోనే ఇద్దరు బాలీవుడ్ నటులు మరణించడంతో తీవ్ర షాక్ కి లోనయ్యింది బాలీవుడ్. నిన్న ఉదయం ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందగా ఈరోజు ఉదయం రిషికపూర్ మరణించడంతో షాక్ లో ఉంది బాలీవుడ్. రిషికపూర్ సీనియర్ నటుడు కాగా బాలీవుడ్ లో దిగ్గజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. రిషికపూర్ కూడా అప్పట్లో స్టార్ హీరో. ఇక ఇప్పటి స్టార్ హీరో రణబీర్ కపూర్ కు తండ్రి కూడా.

ఇక ఈ ఇద్దరు కూడా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ మరణించారు . గతకొంత కాలంగా ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల లండన్ వెళ్ళొచ్చాడు చికిత్స నిమిత్తం. పైగా ఇర్ఫాన్ ఖాన్ తల్లి మరణించిన రెండు రోజుల్లోనే ఇర్ఫాన్ ఖాన్ కూడా మరణించడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది. ఇర్ఫాన్ ఖాన్ కూడా మంచి నటుడు. బాలీవుడ్ లో అర్థవంతమైన చిత్రాల్లో నటించి తన ప్రత్యేకత నిరూపించుకున్నాడు అలాగే విలన్ గా కూడా నటించాడు. ఇర్ఫాన్ ఖాన్ తెలుగులో మహేష్ బాబు హీరోగా వచ్చిన సైనికుడు చిత్రంలో విలన్ గా నటించాడు. ఈ ఇర్ఫాన్ ఖాన్ - రిషికపూర్ ఇద్దరు కూడా 24 గంటల వ్యవధిలో చనిపోవడంతో బాలీవుడ్ లో విషాదం నెలకొంది.