అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ హీరోలు

Published on Apr 14,2020 02:01 PM
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. హిందీ , తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో బాలీవుడ్ హీరోలను విలన్లుగా నటింపజేయాలని చూస్తున్నారు దర్శకులు సుకుమార్.

బాలీవుడ్ హీరోలైన సునీల్ శెట్టి , జాకీ ష్రాఫ్ , సంజయ్ దత్ లలో ఒకరిని విలన్ గా ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అంటే బాలీవుడ్ నటులు ఉంటేనే మార్కెట్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉంటుంది అందుకే సంజయ్ దత్ , జాకీ ష్రాఫ్ , సునీల్ శెట్టి లలో ఒకరిని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట సుకుమార్. హిందీలో కూడా మంచి ఓపెనింగ్స్ రావాలంటే వీళ్ళు ఉపయోగపడతారు మరి