బాలీవుడ్ భామలను పడేస్తున్న విజయ్ దేవరకొండ

Published on Dec 05,2019 01:56 PM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ హీరోయిన్ లను తన బుట్టలో పడేస్తున్నాడు. ఇప్పటికే పలువురు హీరోయిన్ లు విజయ్ దేవరకొండ స్టైల్ కు ఫిదా అవుతున్నారు తాజాగా ఆ లిస్ట్ లోకి కియారా అద్వానీ , అలియా భట్ లు కూడా చేరారు. కియారా అద్వానీ తో ఓ యాడ్ ఫిలిం లో నటించాడు విజయ్ దేవరకొండ దాంతో అతడి హాస్పిటాలిటీకి ఫిదా అయిపొయింది అంతేనా అదే సమయంలో స్టైల్ తో కూడా అదరగొడుతున్నాడు.

తాజాగా ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకలో పాల్గొనడానికి వచ్చిన అలియా భట్ తనకు ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ అని అతడి స్టైలింగ్ నాకు బాగా అచ్చుతుందని అనేసింది. అంటే ఈ లెక్కన తన కాస్ట్యూమ్స్ తో , వే ఆఫ్ టాకింగ్ తో బాగానే ఆకట్టుకుంటున్నాడన్న మాట. ప్రస్తుతం ఈ హీరో వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు దాని తర్వాత ఫైటర్ చిత్రంలో పాల్గొననున్నాడు విజయ్ దేవరకొండ.