రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మళ్ళీ విడుదల

Published on Nov 23,2019 06:29 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ ఎవరు గ్రీన్ చిత్రం '' భాషా '' మళ్ళీ విడుదలకు సిద్ధం అవుతోంది. 1995 లో విడుదలై దక్షిణ భారతదేశంలో ప్రభంజనం సృష్టించిన చిత్రం ఈ భాషా. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన భాషా లో హీరోయిన్ గా నగ్మా నటించింది. ఆటో డ్రైవర్ గా , మాణిక్ భాషగా రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ చేసి థియేటర్ లలో ఈలలు వేయించాడు రజనీ.

కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత భాషా చిత్రం డిజిటల్ వెర్షన్ లో విడుదల అవుతోంది. డిసెంబర్ 11 న భాషా డిజిటల్ వెర్షన్ ని రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 12 న రజనీకాంత్ పుట్టినరోజు కాబట్టి ఈ నిర్ణయం ప్రకటించారు భాషా చిత్ర నిర్మాతలు. తమిళనాట ఎంపిక చేసిన థియేటర్ లలో ఈ సినిమా విడుదల కానుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి డిజిటల్ వెర్షన్ ని రూపొందించారు నిర్మాతలు.