ఉగాది రోజున బ్లాక్ బస్టర్ సినిమా

Published on Apr 03,2019 04:40 PM

ఈ ఉగాది రోజున బుల్లితెర పై బ్లాక్ బస్టర్ సినిమా ఎఫ్ 2 ప్రసారం కానుంది . 2019 సంక్రాంతి బరిలో దిగిన చిత్రం ఎఫ్ 2 . సీనియర్ హీరో వెంకటేష్ - తమన్నా ఒక జంటగా వరుణ్ తేజ్ - మెహరీన్ ఒక జంటగా నటించిన చిత్రం ఎఫ్ 2 . సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ కాగా ఆ సినిమాలను పక్కన పెట్టేసి ఎఫ్ 2 కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . 

85 కోట్ల షేర్ 180 కోట్ల గ్రాస్ వసూళ్ల తో సంచలనం సృష్టించింది ఎఫ్ 2 . ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు . ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6 న ఉగాది రోజున స్టార్ మా టివిలో ప్రసారం చేయనున్నారు . వెండితెర పై నవ్వుల పువ్వులు పూయించిన ఎఫ్ 2 బులితెరపై కూడా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది .