బిత్తిరి సత్తి చాలా అవమానాలు ఎదుర్కొన్నాడట

Published on Oct 24,2019 12:14 PM

బుల్లితెర పై బిత్తిరి సత్తి గా సంచలనం సృష్టించిన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి తనకు ఎదురైన అవమానాలను వివరిస్తూ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. సినిమాల్లోకి రాకముందు పలు సినిమా ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగానని అయితే అందరు కూడా ఘోరంగా అవమానించారని , ఆ అవమానాలు తట్టుకోలేక కాస్టింగ్ కౌచ్ లాగే డ్రింకింగ్ కౌచ్ అనే ఉద్యమం చేద్దామనుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేసాడు బిత్తిరి సత్తి.
సినిమా కష్టాలు పడిన బిత్తిరి సత్తి ఎట్టకేలకు బుల్లితెర పై సంచలనంగా మారాడు. బుల్లితెరపై సంచలనం కావడంతో బిత్తిరి సత్తి కి సినిమా అవకాశాలు కూడా వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక తాజాగా తుపాకీ రాముడు చిత్రంతో హీరోగా మారాడు బిత్తిరి సత్తి. మరి ఈ సినిమా విజయవంతం అవుతుందా ? లేదా ? అన్నది రేపు తేలనుంది.