అయ్యో ! బిత్తిరి సత్తి

Published on Oct 26,2019 02:45 PM

బుల్లితెర పై బిత్తిరి సత్తి అంటే సంచలనమే అని చెప్పాలి ఎందుకంటే తనదైన మేనరిజం తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు దాంతో వెండితెరపై బిత్తిరి సత్తి కి బాగానే అవకాశాలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే బిత్తిరి సత్తి కున్న క్రేజ్ తో అతడ్ని హీరోగా పెట్టి ''తుపాకిరాముడు '' అనే సినిమాని నిర్మించాడు ఎం ఎల్ ఏ రసమయి బాలకిషన్.

నిన్న ఈ సినిమా విడుదల అయ్యింది కానీ ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు. బిత్తిరి సత్తి బాగానే నటించాడు , తన పాత్రకు న్యాయం చేసాడు కానీ సరైన కథ , కథనం లేకపోవడంతో తుపాకి రాముడు ఆశించిన విజయం సాధించలేకపోతోంది. బిత్తిరి సత్తి ని కామెడీ యాంగిల్ లో చూసే ప్రేక్షకులు రెండున్నర గంటలు చూడాలంటే అందుకు తగ్గ కథ , కథనం ఉంటేనే సాధ్యం అవుతుంది. లేకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి పాపం.