ఆకట్టుకుంటున్న భీష్మ ఫస్ట్ లుక్

Published on Oct 27,2019 12:14 PM
ఛలో వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్ నటిస్తున్న చిత్రం '' భీష్మ '' . సింగిల్ ఫరెవర్ అనేది ట్యాగ్ లైన్ . కాగా ఈరోజు భీష్మ ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని దీపావళి కానుకగా విడుదల చేసారు. భీష్మ పోస్టర్ ఆకట్టుకునేలా రూపొందించారు చిత్ర బృందం.
              రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇటీవల కాలంలో నితిన్ నటించిన చిత్రాలు డిజాస్టర్ లు అయ్యాయి దాంతో భీష్మ తనకు మళ్ళీ విజయాలను దగ్గరికి చేర్చుతుందని భావిస్తున్నాడు. ఛలో తర్వాత వెంకీ కుడుముల చేస్తున్న సినిమా కావడంతో భీష్మ పై అంచనాలు నెలకొన్నాయి.