ఏపీ సీఎం జగన్ బయోపిక్ కూడా చేస్తారట

Published on Apr 29,2020 05:51 PM
ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట యాత్ర చిత్ర బృందం. స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం యాత్ర. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ యాత్ర చిత్రంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించాడు. ఆ సినిమా మంచి విజయాన్నే అందుకుంది పైగా జగన్ కు చాలా సహాయపడింది కూడా ఎన్నికల్లో. దాంతో జగన్ కు యాత్ర దర్శక నిర్మాతలు అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది.

కట్ చేస్తే అదే చిత్ర బృందం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ చేయాలనే ఆలోచనతో స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారట. వై ఎస్ మరణం తర్వాత జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. అప్పటి ప్రభుత్వం జగన్ ని ఎలా అణగదొక్కాలని చూసింది , జైలుకు ఎలా పంపింది ....... తిరిగి జగన్ ఎలా బయటకు వచ్చాడు , పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అన్న కథాంశంతో జగన్ బయోపిక్ తెరకెక్కనుందట. కాకపోతే ఈ సినిమా ఇప్పుడు కాదు సుమా ఏపీలో ఎన్నికలు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పటికి వస్తుందట.