మహేష్ ఇచ్చిన షాక్ తో నాగార్జున వద్దకు

Published on Mar 15,2020 05:36 PM
బిగ్ బాస్ 4 రియాలిటీ షోకు మహేష్ బాబు ని తీసుకోవాలని ఆశించారట నిర్వాహకులు అయితే మహేష్ బాబు చెప్పిన రెమ్యునరేషన్ విని షాక్ అయ్యారట. దాంతో మహేష్ బాబు కంటే నాగార్జున బెటర్ అని భావించి మళ్ళీ నాగ్ ని సంప్రదించారట బిగ్ బాస్ నిర్వాహకులు. మహేష్ బాబు మితభాషి అయినప్పటికీ అతడికున్న క్రేజ్ తో రేటింగ్ అద్భుతంగా ఉంటుంది క్రేజ్ వేరే లెవల్ లో ఉంటుందని కలిసారుట.

 కానీ విపరీతమైన క్రేజ్ ఉన్న మహేష్ రెమ్యూనరేషన్ కూడా చాలా కాస్ట్లీ అన్న విషయం కూడా విదితమే ! మహేష్ చెప్పన రేటు విని షాక్ అయిన బృందం నాగార్జున చేత బిగ్ బాస్ 4 సీజన్ చేయించాలని అనుకుంటున్నారట. నాగార్జున ఇప్పటికే బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అది మంచి సక్సెస్ అయ్యింది పైగా నాగార్జున హోస్ట్ గా అద్భుతంగా ఆకట్టుకునేలా చేస్తున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా నాగ్ వల్లే ఫేమస్ అయ్యింది తెలుగునాట. దాంతో నాగ్ బెస్ట్ ఛాయిస్ అని ఫీల్ అవుతున్నారట.