భారీ థియేటర్ సాహో తో ప్రారంభం

Published on Aug 29,2019 10:49 AM

ఆసియా ఖండంలోనే భారీ థియేటర్ ని ప్రారంభించబోతున్నారు సాహో చిత్రంతో . ఈనెల 30 న అంటే రేపు సాహో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఇక నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో ఆసియా ఖండంలోనే అత్యంత భారీ థియేటర్ ని నిర్మించారు యువి క్రియేషన్స్ అధినేతలు. కాగా ఆ థియేటర్ ని తాము నిర్మించిన సాహో తోనే ప్రారంభిస్తున్నారు. ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైన స్క్రీన్ ని ఈ థియేటర్ లో ఏర్పాటు చేసారు. 

ఇంతకీ ఆ స్క్రీన్ పొడవు , వెడల్పు ఎంతో తెలుసా ......... 106 అడుగుల వెడల్పు 94 అడుగుల నిలువు గల స్క్రీన్ తో ఈ థియేటర్ ని కట్టించారు. ఇక ఈ థియేటర్ కెపాసిటీ 670 సీట్లు . అధునాతనమైన 3 డి సౌండ్ సిస్టం తో నిర్మించారు. రేపు ఈ థియేటర్ ప్రారంభం కానుంది.