ఆకట్టుకుంటున్న భీష్మ ట్రైలర్

Published on Feb 18,2020 06:27 PM

నితిన్ హీరోగా నటించిన భీష్మ ట్రైలర్ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు స్వరసాగర్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రం ఈనెల 21న భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో జరిగింది. ఈ కార్యక్రమానికి నితిన్ ఫ్యాన్స్ తో పాటుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా రావడం విశేషం.

ఇక ఈ వేడుకలో ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందడంతో నితిన్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. యాక్షన్ తో పాటుగా మంచి లవ్ ట్రాక్ కూడా ఉంది అలాగే మంచి సందేశం కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది సినిమాలో. మొత్తానికి ట్రైలర్ చూస్తే సినిమా హిట్ అనే వినబడుతోంది. నితిన్ - రష్మిక జోడీ కూడా బాగా సెట్ అయ్యింది.