భారీ వసూళ్లు సాధిస్తున్న భీష్మ

Published on Feb 22,2020 12:40 PM

నితిన్ హీరోగా నటించిన భీష్మ భారీ వసూళ్లను సాధిస్తోంది. మహాశివరాత్రి కానుకగా నిన్న విడుదలైన భీష్మ భారీ ఓపెనింగ్స్ సాధించింది. నిన్న ఒక్క రోజులోనే 6 కోట్లకు పైగా తెలుగు రాష్ట్రాలలో షేర్ వసూల్ చేసింది భీష్మ చిత్రం. అలాగే ఓవర్ సీస్ లో కూడా బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు నితిన్. నిన్న ఒక్కరోజే అక్కడ లక్ష డాలర్లపైగా వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక టాక్ కూడా సూపర్ గా ఉండటంతో పాటుగా హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉండటంతో భీష్మ అవలీలగా 40 కోట్ల షేర్ సాధించడం ఖాయమని భావిస్తున్నారు.

మొదటి రోజున 7 కోట్ల షేర్ రావడంతో సంతోషంగా ఉన్నారు భీష్మ బృందం. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించింది. బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో అవలీలగా 40 కోట్ల షేర్ రాబట్టడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు. భీష్మ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ జోరు మరింతగా పెరిగేలా కనబడుతోంది.