భీష్మ 10 రోజుల కలెక్షన్స్

Published on Mar 04,2020 04:07 PM

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన భీష్మ ఫిబ్రవరి 21న విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 10 రోజుల్లోనే 26 కోట్ల పైచిలుకు షేర్ సాధించి ఈ సినిమాని కొన్న పంపిణీదారులను లాభాల్లో ముంచెత్తింది. నితిన్ నటించిన గత సినిమాలు వరుసగా ప్లాప్ లు అవ్వడంతో ఈ సినిమాకు కేవలం 22 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. అయితే సినిమాకు యునానిమస్ గా హిట్ టాక్ రావడంతో కేవలం 10 రోజుల్లోనే 26 కోట్ల షేర్ వచ్చింది దాంతో ఈ సినిమా బయ్యర్లు అందరూ లాభాలు ఆర్జిస్తున్నారు.

తెలంగాణ                    -  8.57 కోట్లు

రాయలసీమ                -  3.13 కోట్లు

కృష్ణా                            -  1.44 కోట్లు

గుంటూరు                    -   1.73 కోట్లు

ఉత్తరాంధ్ర                   -   2.86 కోట్లు

ఈస్ట్                             -   1.64 కోట్లు

వెస్ట్                              -   1.21 కోట్లు

నెల్లూరు                       -   72 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా       -  1. 88 కోట్లు

ఓవర్ సీస్                     - 3. 10 కోట్లు

మొత్తం                          -  26. 28 కోట్లు