ఛాన్స్ ల కోసం తహతహలాడుతున్న భామ

Published on Sep 03,2019 02:06 PM

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో తెలంగాణ పోరి గా నటించి కుర్రాళ్ళని పిచ్చెక్కించిన భామ నభా నటేష్ తాజాగా ఛాన్స్ ల కోసం తహతహలాడుతోంది. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ తో పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చి పడతాయని అనుకుంది పాపం! అయితే ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ వచ్చినప్పటికీ కొత్తగా ఈ భామకు వచ్చిన ఛాన్స్ లు అంటూ ఏమి లేవు. 
ఈ భామ ఛాన్స్ ల కోసం  స్కిన్ షో చేస్తూనే ఉంది నభా నటేష్. అయితే ఈ భామ ఎంతగా స్కిన్ షో చేసినా , ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ వచ్చినా అదృష్టం తలుపు తట్టడం లేదని బాధపడుతోంది నభా. తాజాగా ఈ భామ రవితేజ సరసన డిస్కో రాజా చిత్రంలో నటిస్తోంది. ఇక ఆ సినిమా తప్ప మరే సినిమా కూడా లేదు ఈ భామ చేతిలో.