ఆసక్తికరంగా ఉన్న భాగ్యనగర వీధుల్లో ట్రైలర్

Published on Nov 21,2019 10:52 PM

కొద్దిసేపటి క్రితం భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు  చిత్ర ట్రైలర్ విడుదల అయ్యింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసాడు. కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహించి కీలక పాత్రలో నటించాడు కూడా. పూర్తిగా హాస్య భరింతగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ కూడా వినోదాత్మకంగానే ఉంది. వినోద భరితంగా ట్రైలర్ ఉండటంతో తప్పకుండా హిట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనివాస రెడ్డి తో పాటుగా షకలక శంకర్ , సత్య , వెన్నెల కిషోర్ , సత్యం రాజేష్ , రఘుబాబు , ప్రవీణ్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాని డిసెంబర్ 6 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో శ్రీనివాస రెడ్డి ముఖంలో సంతోషం వెల్లివిరుస్తోంది. అయితే భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు చిత్రం పై ప్రేక్షకుల తీర్పు ఏంటి ? అన్నది డిసెంబర్ 6 న తేలనుంది.