అదిరిపోయేలా ఉన్న భాగీ 3 ట్రైలర్

Published on Feb 06,2020 10:21 PM

భాగీ సూపర్ హిట్ కావడంతో భాగీ 2 వచ్చింది కట్ చేస్తే ఇప్పుడు భాగీ 3 కూడా విడుదలకు సిద్ధమైంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన భాగీ 3 ట్రైలర్ తాజాగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ నాలుగు నిమిషాల పాటు ఉంది. పూర్తిగా యాక్షన్ సీన్స్ తో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ట్రైలర్ కు యాక్షన్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. టైగర్ ష్రాఫ్ కు అసలే యాక్షన్ ఇమేజ్ ఉంది దాంతో ఈ సినిమాని భారీ లెవల్ లో ప్లాన్ చేసారు.

మార్చి 6 న భాగీ 3 చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఉగ్ర మూకల రాజ్యం అయిన సిరియా లో కిడ్నాప్ కాబడిన తన సోదరుడిని కాపాడుకునే హీరోగా టైగర్ ష్రాఫ్ అదిరిపోయే రేంజ్ లో ఫీట్స్ చేసాడు. టైగర్ ఫీట్స్ చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. ఈరోజు విడుదలైన ట్రైలర్ తో భాగీ 3 సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ తో పాటుగా రొమాన్స్ కూడా ఈ సినిమాలో బాగానే ఉందట.