100 కోట్ల దిశగా బాఘీ 3

Published on Mar 12,2020 06:10 PM

బాఘీ 3 వంద కోట్ల దిశగా దూసుకుపోతోంది. టైగర్ ష్రాఫ్ - శ్రద్దా కపూర్ జంటగా నటించిన బాఘీ 3 మోతంగా అయిదు రోజుల్లోనే 76 కోట్ల 94 లక్షల వసూళ్ళని సాధించింది. బాఘీ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో ఈ మూడో చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కట్ చేస్తే ఆ అంచనాలను అందుకోవడంలో విజయం సాధించింది బాఘీ 3. టైగర్ ష్రాఫ్ కు వరుస విజయాలు దక్కుతుండటంతో చాలా సంతోషంగా ఉన్నాడు.

బాఘీ 3 వసూళ్లు ఇలా ఉన్నాయి . మార్చి 6 నవిడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజున  17. 50 కోట్ల వసూళ్లు రాగా రెండో రోజున 16. 03 కోట్లు , మూడో రోజున 20 కోట్ల 30 లక్షలు నాలుగో రోజున 9కోట్ల 6 లక్షలు ఐదో రోజున 14. 05 కోట్లు వచ్చాయి దాంతో అయిదు రోజుల్లోనే 76 కోట్ల 94 లక్షల వసూళ్ళని సాధించినట్లైంది. ఈ జోష్ ఇలాగె కొనసాగితే అవలీలగా 100 కోట్లని దాటేసి 200 కోట్ల మైలురాయిని చేరుకోవడం ఖాయమని తెలుస్తోంది.