బెస్ట్ విషెష్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్

Published on Oct 23,2019 03:50 PM
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి చిన్న కొడుక్కి బెస్ట్ విషెష్ చెప్పాడు. ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి కి ఇద్దరు కొడుకులు కాగా అందులో చిన్నవాడు సింహా కోడూరి. కాగా సింహా కోడూరి మత్తు వదలరా అనే చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ''మత్తు వదలరా '' చిత్ర ఫస్ట్ లుక్ ని జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేస్తూ శుభాకాంక్షలు అందజేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎస్ ఎస్ రాజమౌళి , ఎం ఎం కీరవాణి కుటుంబాలకు అత్యంత సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. దాంతో ఈ చిత్ర ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ నడుం బిగించాడు. వారసుల రాజ్యం లోకి కీరవాణి వారసుడు కూడా వస్తున్నాడు మరి యితడు హీరోగా సక్సెస్ అవుతాడా ? లేదా ? అన్నది చూడాలి.