8 ప్యాక్స్ లో అదరగొడుతున్న బెల్లంకొండ

Published on Nov 26,2019 11:51 AM

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 8 ఫ్యాక్స్ తో అదరగొడుతున్నాడు. ఇన్నాళ్లు స్టార్ హీరోలు కానీ యంగ్ హీరోలు కానీ 6 ఫ్యాక్స్ కు మాత్రమే పరిమితం కాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రం 8 ఫ్యాక్స్ తో తన అభిమానులను అలరించడానికి సిద్దమయ్యాడు. నిన్న సాయంత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 8 ఫ్యాక్స్ తో ఉన్న స్టిల్ విడుదల చేసి ఔరా అనిపించారు. ఈ కష్టమంతా బెల్లంకొండ ఎందుకు పడ్డాడో తెలుసా ?

తన కొత్త సినిమా కోసం. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమా ఈనెల 29 న ప్రారంభం కానుంది. ఇక రెగ్యులర్ షూటింగ్ కూడా వచ్చే నెల నుండి జరుగనుంది. ఇటీవలే రాక్షసుడు చిత్రంతో విజయం అందుకున్న బెల్లంకొండ మంచి జోష్ తో ఉన్నాడు.