బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ల 'సీత' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

Published on Jan 28,2019 02:58 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న 'సీత' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ లు ఇద్దరు  ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు..  బెల్లంకొండ శ్రీనివాస్ తో కాజల్ వరుసగా రెండో సినిమా చేస్తుండగా, దర్శకుడు తేజ 'నేనే రాజు నేనే మంత్రి' లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత  వైవిధ్యమైన కథ తో సినిమా ని తెరకెక్కిస్తున్నాడు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇలాంటి జోనర్ లో తొలిసారి చేస్తుండడం విశేషం.. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా  లో సోనూ సూద్, మన్నారా చోప్రా లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా కి శీర్ష రాయ్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఏకే ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. 

నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోనూ సూద్, మన్నారా చోప్రా

సాంకేతిక నిపుణులు :

దర్శకత్వం: తేజ

నిర్మాత: రామబ్రమ్మం సుంకర

బ్యానర్: ఎకే ఎంటర్టైన్మెంట్స్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి

సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్

సమర్పణ : ATv

సంగీతం: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: శీర్ష రాయ్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు

ఫైట్స్: కనల్ కన్నన్

పబ్లిసిటీ ఇన్ ఛార్జ్: విశ్వ CM

PRO: వంశీ-శేఖర్