నాన్న చెబితే ఓకే అంటున్న బెల్లంకొండ

Published on Jan 03,2020 04:16 PM

నాన్న చెబితే ఓకే అని అంటున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇంతకీ నాన్నకు ఏం చెప్పాలి , ఎందుకు ఈ హీరో ఓకే అంటాడో తెలుసా ........ కథ అట! సినిమా కథ మొదట నాన్న బెల్లంకొండ సురేష్ కు చెప్పాలట ! ఆ కథ విన్నాక నచ్చితే అప్పుడు ఈ హీరో వింటాడట. ఎందుకంటే  నాన్నకు నచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి అలాగే ఓ మోస్తరుగా ఆడాయి కానీ నాకు నచ్చి చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయని అందుకే ఈ నిర్ణయమని అంటున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

తాజాగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆ సినిమా కథ ముందుగా బెల్లంకొండ సురేష్ విన్నాడట! సినిమా కథ బాగుందని అందుకే చేస్తున్నానని ఇకపై నాన్నకు నచ్చిన కథలు మాత్రమే చేస్తానని అంటున్నాడు. ఈరోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు. గత ఏడాది ఈ హీరో నటించిన రాక్షసుడు మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో చాలా సంతోషంగా ఉన్నాడు బెల్లంకొండ.