సూపర్ హిట్ రీమేక్ తో నైనా హిట్ కొడతాడా ?

Published on Feb 13,2019 04:18 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోంది కానీ సక్సెస్ మాత్రం కొట్టలేకపోతున్నాడు . అల్లుడు శీను చిత్రం తప్ప ఈ హీరో నటించిన మిగతా చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందినవే దాంతో ఈ హీరో అంటే భయపడుతున్నారు . అయితే పట్టువదలని విక్రమార్కుడిలా మాత్రం విజయం కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . 

తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఈ హీరో . రైడ్ , వీర చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కనుంది . హిట్ కోసం పోరాడుతున్న ఈ హీరో ఈ సూపర్ హిట్ రీమేక్ తోనైనా హిట్ కొడతాడా ? చూడాలి . త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది .