రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి

Published on Mar 05,2020 02:35 PM

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై బీరు సీసాలతో దాడి చేసి కొట్టారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన నిన్న రాత్రి హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జరిగింది. గచ్చిబౌలి లోని ప్రిజం పబ్ కు తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాడు బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. అయితే అక్కడ ఎం ఎల్ ఏ రోహిత్ రెడ్డి కి చెందిన మనుషులతో రాహుల్ కు వాగ్వాదం జరిగింది. ఆ గొడవలో రాహుల్ మిగతా వాళ్ళు నెట్టుకోగా కోపంతో రగిలిపోయిన కొంతమంది బీర్ బాటిళ్లతో రాహుల్ పై దాడి చేసారు.

బీరు బాటిల్ తలమీద పగలడంతో రక్తస్రావం జరిగింది. దాంతో రాహుల్ సిప్లిగంజ్ పబ్ కు సమీపంలోనే ఉన్న ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అయితే ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి వెళ్ళాడు రాహుల్ సిప్లిగంజ్. ఈ గొడవ విషయం పోలీసులకు తెలియడంతో పబ్ కి వచ్చి విచారణ చేసారు. పోలీసుల విచారణలో రాహుల్ పై దాడికి పాల్పడింది రోహిత్ రెడ్డి మనుషులను తేలింది దాంతో సుమోటాగా కేసు నమోదు చేస్తామని తెలిపారు పోలీసులు.