బ్యూటీ ఫుల్ అంటూ రెచ్చిపోయిన నైనా

Published on Nov 18,2019 11:21 AM

హాట్ భామ నైనా గంగూలీ తాజాగా బ్యూటీ ఫుల్ అనే చిత్రంలో నటిస్తోంది. ఊర్మిళ నటించిన రంగీలా చిత్రానికి స్ఫూర్తి అంటూ వస్తున్న ఈ చిత్రంలో నైనా గంగూలీ వీర లెవల్లో రెచ్చిపోయింది. నైనా అందాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి. తాజాగా బ్యూటీ ఫుల్ చిత్రం లోని స్టిల్స్ అంటూ కొన్నింటిని విడుదల చేసారు ఆ చిత్ర బృందం. ఆ స్టిల్స్ చూస్తుంటే కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూడటం ఖాయం అలా ఉన్నాయి నైనా అందాలు.

అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ నిర్మిస్తుండటం విశేషం. నైనా గంగూలీ ఇప్పటికే వర్మ చిత్రాల్లో నటించింది. వర్మ దర్శకత్వంలో నటించే భామలు ఎక్కడా అందాలను దాచుకోకుండా ఎంతగా చూపిస్తారన్న విషయం తెలిసిందే. ఇక నైనా గంగూలీ కూడా తక్కువేమి తినలేదు , మిగతా భామలకంటే రెండాకులు ఎక్కువే చదివింది అందుకే రెచ్చిపోయి అందాలను ఆరబోసింది.