ర అండ్ రియలిస్టిక్ రస్టిక్ తో రూపొందిన "బీచ్ రోడ్ చేతన్" టీజర్ విడుదల

Published on Sep 07,2019 02:50 PM

రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు, చిత్రాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ర అండ్ రియలిస్టిక్ రస్టిక్ ఫిలిం "బీచ్ రోడ్ చేతన్". చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ని సెప్టెంబర్ 7న విడుదల చేసారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శక-నిర్మాత-హీరో చేతన్ మద్దినేని, హీరోయిన్ తేజ రెడ్డి, నటులు వీరేష్ బాబు, రవి నాగ్, మోహన్, కెమెరామెన్ నిశాంత్ రెడ్డి, పాల్గొన్నారు. 
దర్శక-నిర్మాత-హీరో చేతన్ మద్దినేని మాట్లాడుతూ.. రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రాలు సక్సెస్ అయి హీరోగా మంచి పేరు తెచ్చాయి. కానీ ఇండివిడ్యువల్ గా  చేతన్ మద్దినేని అనేంతగా సరైన గుర్తిపు రాలేదు. దానికోసమే ఈ ప్రయత్నం చేశాను. ఆ మూడు చిత్రాల తర్వాత చాలా కథలు విన్నాను. ఏది అంతగా నచ్చలేదు.  నేనే సొంతంగా కథ రాసుకున్నాను. కమర్షియల్ అంశాలను జోడించి  ర అండ్ రియలిస్టిక్ రస్టిక్ కంటెంట్ తో  "బీచ్ రోడ్ చేతన్" సినిమా చేశాను. సినిమా అంత వైజాగ్ లో షూట్ చేయడం జరిగింది. అక్కడ నాకు టెక్నీకల్ గా ఈశ్వర్ రావ్, మోహన్, వీరేష్ మోరల్ సపోర్ట్ చేసారు. ముఖ్యంగా కెమెరామెన్ నిశాంత్ చాలా కష్టపడ్డాడు. అలాగే ఈ చిత్రంలో వంద మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశాం. అందరి సహకారం ఉండబట్టే ఈజీగా సినిమా పూర్తిచేయగలిగాం. బీచ్ రోడ్ లో తిరిగే ఒక బేవర్స్ కథ ఇది. బీచ్ అనగానే యూత్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో నేను చేతన్ క్యారెక్టర్ చేశాను. అందుకే ఈ చిత్రానికి బీచ్ రోడ్ చేతన్ అని పెట్టడం జరిగింది. ఈ సినిమాతో చేతన్ మద్దినేనిగా నాకు మరింత గుర్తింపు లభిస్తుందనే కాన్ఫిడెన్స్ తో వున్నాను. వచ్చేనెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. 
హీరోయిన్ తేజ రెడ్డి మాట్లాడుతూ.. నా క్యారెక్టర్ చాలా డీసెంట్ గా ప్లెజెంట్ గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న పాత్ర. ఈ సినిమా నాకు మంచి బ్రేక్ అవుతుందని నమ్మకం వుంది. ఈ అవకాశం ఇచ్చిన చేతన్ మద్దినేనికి నా థాంక్స్ అన్నారు. 
కెమెరామెన్ నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న సినిమాగా స్టార్ట్ అయి పెద్ద సినిమా రేంజ్ లో ఈ చిత్రాన్ని చేశాం. టెక్నీషియన్స్ అందరు పెద్దవాళ్ళే వర్క్ చేసారు.  సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చింది. ఈ క్రెడిట్ అంతా చేతన్ మద్దినేనికే దక్కుతుంది... అన్నారు. వైజాగ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న మాకు చేతన్ ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చారని నటులు మోహన్, రూపేష్ తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. 
చేతన్ మద్దినేని, తేజ రెడ్డి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు; చేతన్ మద్దినేని, పాటలు: బి. రాజారత్నం, ఎడిటర్: యం.ఆర్. వర్మ, డిఒపి: నిశాంత్ రెడ్డి, సంగీతం: శామ్యుల్ జె.బెనయ్య, ఫైట్స్: రియల్ సతీష్, నిర్మాత-దర్శకత్వం; చేతన్ మద్దినేని. 
బీచ్ రోడ్ చేతన్ టీజర్ రిలీజ్ మేటర్