బతుకు బలైపోయిన బండి

Published on Apr 15,2020 05:12 PM
బతుకు జట్కా బండి అనే కార్యక్రమం విని ఉంటారు అలాగే చూసి ఉంటారు కానీ మాది మాత్రం బతుకు బలైపోయిన బండి అని అంటోంది హాట్ యాంకర్ శ్రీముఖి. బతుకు జట్కా బండికి స్పూఫ్ గా ఓ కార్యక్రమం చేసారు యు ట్యూబ్ ఛానల్ కోసం. పైగా ఇది కరోనా సమయం కాబట్టి ఇలాంటి వాటికి బాగానే ఆదరణ లభిస్తుందని భావించి ఇలా చేసారు. బతుకు బలైపోయిన బండి లో శ్రీముఖి జడ్జిగా పనిచేసింది.

ఇక గొడవపడి సమస్య పరిష్కారం కోసం వచ్చే జంటగా అవినాష్ - విష్ణు ప్రియా నటించారు. కబుపుబ్బా నవ్వుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం ఫలించడంతో శ్రీముఖి బృందం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ముక్కు అవినాష్ జబర్దస్త్ లో చాలా కామెడీ స్కిట్ లు చేసాడు. ఇక విష్ణు ప్రియా యాంకర్ గా రాణిస్తోంది. శ్రీముఖి గురించి కొత్తగా చెప్పేదేముంది. ఈ ముగ్గురూ కలిసి మంచి ప్రయత్నమే చేసారు.