పవన్ కళ్యాణ్ తో మళ్ళీ సినిమా చేస్తానంటున్నబండ్ల గణేష్

Published on May 02,2020 11:25 AM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భక్తుడు అయిన నటుడు , నిర్మాత బండ్ల గణేష్ పవన్ తో ఎలాగైనా సరే మళ్ళీ సినిమా తీస్తానని అంటున్నాడు. అనడమే కాదు తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ , గబ్బర్ సింగ్ వంటి చిత్రాలను నిర్మించాడు బండ్ల గణేష్. తీన్ మార్ ప్లాప్ అయ్యింది కానీ గబ్బర్ సింగ్ మాత్రం ప్రభంజనం సృష్టించింది. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో మళ్ళీ సినిమా చేయాలనీ చూసాడు కానీ కుదరలేదు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ . ఇక రీ ఎంట్రీలో ఏకంగా మూడు సినిమాలను ప్రకటించడమే కాకుండా అందులో 2 సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు కూడా. ఎలాగూ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి నాకు కూడా ఓ సినిమా చేయండి గురూ అంటూ పెద్ద ప్రయత్నాలే చేస్తున్నాడట బండ్ల. మరి పవన్ కళ్యాణ్ ఈ బండ్ల గణేష్ కు మళ్ళీ సినిమా చేసే ఛాన్స్ ఇస్తాడా ? లేదా ? చూడాలి.