మహేష్ బాబుపై సంచలన ట్వీట్ చేసిన బండ్ల గణేష్

Published on Apr 14,2020 02:05 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పై సంచలన ట్వీట్ చేసాడు నటుడు , నిర్మాత బండ్ల గణేష్. మహేష్ బాబు కాస్త గడ్డం పెంచి, రఫ్ లుక్ లో ఉన్న ఓ ఫోటోని షోషల్ మీడియాలో షేర్ చేసి హాలీవుడ్ స్టార్ అంటూ పొగుడుతున్నాడు బండ్ల గణేష్. మహేష్ బాబు ఉండటమే హాలీవుడ్ స్టార్ లా ఉంటాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే టాలీవుడ్ దాటేసి నేను ఎక్కడికి పోను , కనీసం హిందీ చిత్రాల్లో కూడా నటించేది లేదు అంటూ చాలాసార్లు ప్రకటించాడు మహేష్ బాబు.

అయితే హీరోలను పొగడటంలో వాళ్ళను తన బుట్టలో వేసుకొవడంలో బండ్ల గణేష్ ది అందెవేసిన చేయి అనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ అయితే తన దేవుడు అంటూ కీర్తిస్తాడు బండ్ల. పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలను కూడా నిర్మించాడు. అలాగే ఎన్టీఆర్ తో ఒక సినిమా తీసాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు మీద పడినట్లుంది అతడి దృష్టి అందుకే మహేష్ బాబుని హాలీవుడ్ స్టార్ అంటూ పొగడుతున్నాడు. మరి బండ్ల వలలో మహేష్ పడతాడా ? చూడాలి.