కరోనా వైరస్ తో నష్టపోయిన బండ్ల గణేష్

Published on Mar 13,2020 02:45 PM

కరోనా వైరస్ తో ప్రపంచమంతా నిలువెల్లా వణికిపోతుంటే నటుడు , నిర్మాత బండ్ల గణేష్ కూడా తీవ్రంగా నష్టపోతున్నాడు. బండ్ల గణేష్ కు కరోనా వైరస్ కు సంబందం ఏంటి ? అని అనుకుంటున్నారా ? బండ్ల గణేష్ కు పౌల్ట్రీ ఫామ్ ఉందన్న సంగతి తెలిసే ఉంటుంది. కోళ్లు , గుడ్ల వ్యాపారం బాగా చేస్తుంటాడు బండ్ల గణేష్. అసలు బండ్ల గణేష్ ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే ..... పౌల్ట్రీ ఫామ్ లో బాగా లాభాలు రావడమే !

అయితే కరోనా వైరస్ భయంతో చికెన్ తినడం లేదు జనాలు పోనీ గుడ్లు అయినా తింటారేమో అనుకుంటే లెగ్స్ కూడా అమ్ముడుపోవడం లేదట దాంతో 200 రూపాయలకు పైగా ఉన్న చికెన్ రేటు ఏకంగా 50 నుండి 80 రూపాయలకు పడిపోయింది. ఇక ఎగ్స్  కూడా అమ్ముడుకుపోకపోవడంతో బండ్ల గణేష్ కు భారీగా నష్టాలు వస్తున్నాయట. అసలే సినిమాలు తీసి ఆర్ధికంగా నష్టపోయిన బండ్ల గణేష్ కు కరోనా రూపంలో మరింత నష్టం , కష్టం వచ్చిపడింది