నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్

Published on Oct 24,2019 12:11 PM
నిర్మాత , నటుడు బండ్ల గణేష్ ని అరెస్ట్ చేసారు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీసులు. ప్రొద్దుటూరు లో పలువురు ఫైనాన్షియర్ లకు బండ్ల గణేష్ డబ్బులు బాకీ పడ్డారు అయితే వాళ్లకు చెక్స్ ఇచ్చారు అయితే ఆ చెక్స్ బౌన్స్ అయ్యాయి దాంతో కేసులు పెట్టారు. అలాగే మరో నిర్మాత పివిపి కి కూడా బండ్ల గణేష్ డబ్బులు ఇవ్వాలి. ఎన్టీఆర్ తో నిర్మించిన టెంపర్ చిత్రం కోసం చేసిన అప్పు కొంత తీర్చినప్పటికీ మరో 7 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉందట.
పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్, రాంచరణ్ తదితర హీరోలతో భారీ చిత్రాలను నిర్మించాడు బండ్ల గణేష్. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన బండ్ల గణేష్ అనూహ్యంగా నిర్మాతగా మారాడు అయితే ఇప్పుడేమో చెక్ బౌన్స్ కేసుల్లో ఇరుక్కున్నాడు పాపం. పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ నన్ను అరెస్ట్ చేయలేదు విచారణ కోసం పిలిపించారు అని అంటున్నాడు బండ్ల గణేష్.