బాలయ్య చెత్త సినిమా ఈనెల 9న బుల్లితెరలో

Published on Feb 04,2020 08:02 PM

ఈనెల 9 వ తేదీన బాలయ్య నటించిన చెత్త సినిమా బుల్లితెరలో టెలికాస్ట్ కానుంది. ఇంతకీ బాలయ్య చెత్త సినిమా ఏదో తెలుసా ...... రూలర్. డిసెంబర్ లో విడుదలైన రూలర్ చిత్రానికి కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సి. కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది ఆఖరున విడుదల అయ్యింది. బాలయ్య విగ్గుపై , గెటప్ పై ఈ సినిమాలో బోలెడు విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా బాలయ్య పోలీస్ గెటప్ పై అయితే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి విగ్గు పై కూడా.

కాగా ఈ రూలర్ సినిమా ఈ ఆదివారం రోజున అంటే ఫిబ్రవరి 9 న టివిలో ప్రసారం కానుంది. 50 రోజులు కూడా పూర్తి కాకుండానే బుల్లితెరలో ప్రసారం కానుంది ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద భారీ బోల్తా కొట్టిన ఈ చిత్రం బుల్లితెర పై కూడా ఆదరణ చూరగొనడం కష్టమే! కాకపోతే కొంతమంది అయినా ఎలా ఉందో చూద్దామని చూస్తారేమో అంతే !