హీరోయిన్ కోసం కష్టపడుతున్న బాలయ్య

Published on Nov 11,2019 05:01 PM

సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో '' సింహా '' , '' లెజెండ్ '' వంటి బ్లాక్ బస్టర్ లు వచ్చాయి. దాంతో ఈ మూడో చిత్రం పై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ బాలయ్య కు సరైన హీరోయిన్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

బాలయ్య సరసన నటించడానికి కుర్ర హీరోయిన్ లు సిద్ధంగా లేరు అలాగే స్టార్ హీరోయిన్ లు కూడా దాంతో సీనియర్ నటీమణులో లేక కొత్తవాళ్లనో తీసుకోవాల్సి వస్తోంది. అయితే సీనియర్ హీరోయిన్ లైతే ప్రేక్షకులకు అంతగా నచ్చదు , ఇక కొత్తవాళ్లు అయినా సరే దాంతో ఏమి చేయాలో పాలుపోక సతమతం అవుతున్నాడు బాలయ్య అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను.